డా.భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సందేశాత్మక చిత్రం ‘మాస్టర్ సంకల్ప్’. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. నటుడు శివాజీరాజా ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. దర్శక,నిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ ‘పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.
పరీక్షలు, కుటుంబ వాతావరణం, మొబైల్ ఫోన్లు ఇవన్నీ పిల్లల మానసిక రుగ్మతలకు కారణాలు. వీటిని దూరం చేయాలంటే మన పూర్వీకులు చెప్పిన యోగ, ధ్యానం చక్కని మార్గాలు. వాటిపై తల్లిదండ్రులకు అవగాహన శూన్యం. అందుకే అందరికీ వాటిపై అవగాహన పెంచే చక్కని కథాంశంతో ఈ సినిమా చేశాం. ఇందులో అద్భుతమైన వినోదం కూడా ఉంటుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం.’ అని తెలిపారు. ఇంకా శ్రీ మిత్ర చౌది, పెంచల్ రెడ్డి కూడా మాట్లాడారు.