Master Bharath | టాలీవుడ్ నటుడు, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ భరత్ (Master Bharath) ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆమె అకాల మరణంతో భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయాన్ని కుటంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయనకు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్.. ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.
తెలుగులో అంజి సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. రెడీ, ఢీ, దూకుడు, హ్యాపీ, దేనికైనా రెడీ ఇలా తెలుగు, తమిళ భాషల్లో వందకుపైగా సినిమాల్లో నడించాడు. రెడీ, బిందాస్ సినిమాల్లో నటనకుగాను నంది అవార్డులు అందుకున్నాడు.