సల్మాన్‌ఖాన్ నటిస్తున్న ‘టైగర్-3’ చిత్రంలో షారుఖ్‌ఖాన్ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ‘పఠాన్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశారు. దాంతో ‘టైగర్-3’ చిత్రంలో షారుఖ్‌ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే షారుఖ్‌ఖాన్ స్క్రీన్‌స్పేస్ తక్కువే అయినా రోమాంచితమైన యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తారని అంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే ముంబయిలో భారీ సెట్‌ను నిర్మించారు.
హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పాల్గొనగా సల్మాన్, షారుఖ్ఖాన్లపై వారం రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌లో పోరాట ఘట్టాల షూటింగ్ ప్రారంభిస్తామని..సల్మాన్, షారుఖ్‌ఖాన్ చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం పేర్కొంది. ఆదిత్యచోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ వ్యయంతో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.