War 2 Telugu Version | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు సీక్వెల్‌గా రాబోతుంది. హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
మొదటి భాగం ఘన విజయం సాధించడంతో, ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో మరియు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంపై ఉన్న బజ్ కారణంగా.. ‘వార్ 2’ తెలుగు వెర్షన్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘వార్ 2’ తెలుగు హక్కుల కోసం నిర్మాతలు రూ. 85 కోట్ల నుంచి రూ. 120 కోట్ల వరకు ధర పలుకుతున్నారట. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు నాగ వంశీ, సునీల్ నారంగ్ ఈ తెలుగు హక్కులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ నటి కియారా అద్వానీ ‘వార్ 2’లో కథానాయికగా నటిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల కానుంది.