అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 13న విడుదలకానుంది. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్‌ఆఫీసర్ ఏసీపీ విక్రమ్‌సాగర్ పాత్రలో కనిపించనున్నారు. సోమవారం ఆయన ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ‘ఫస్ట్‌టైమ్ ఒక మేకపిల్లని ఎత్తుకొని పులి వస్తా ఉన్నది’..‘ఏంరా వారీ..పిస పిస చేస్తుండావ్..నీకింకా సమజ్కాలే..నేను ఎవ్వనయ్యకీ యిననని’ వంటి డైలాగ్‌లు హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి.
రవితేజ పాత్రను దర్శకుడు ప్రత్యేకంగా డిజైన్ చేశారని, ఆయన శైలి మాస్ అంశాలు మెప్పిస్తాయని చిత్రబృందం పేర్కొంది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు.ఎస్వీకే గోల్డెన్ డేస్ తిరిగొస్తాయి
సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందిస్తున్న సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. సొహైల్, మృణాళిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘అల్లసాని వారి అల్లిక..’ పాటను విడుదల చేశారు. ఇదే కార్యక్రమంలో నిర్మాత సి కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా అతిథిగా వచ్చిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ…‘కృష్ణారెడ్డి సినిమాలన్నీ గోల్డెన్ డేస్. మళ్లీ ఈ చిత్రంతో ఆ రోజులు తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించాం. ఇందులో నా గత హిట్ చిత్రాల అంశాలన్నీ పొందుపర్చాం’ అన్నారు. సమర్పకులు అచ్చిరెడ్డి మాట్లాడుతూ..‘మా గత చిత్రాల తరహాలో ఉంటూనే నేటితరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోహైల్, మృణాళినీ జంట ఆకర్షణ అవుతుంది’ అన్నారు.