Actor Raviteja | మాస్ మహారాజా రవితేజ తన కుమారుడు మహాధన్ కెరీర్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కుమారుడి భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ తన కొడుకుపై ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. రవితేజ కుమారుడు మహాధన్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు ఇద్దరూ కలిసి ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి యాంకర్ సుమ రవితేజని అడుగగా.. రవితేజ మాట్లాడుతూ.. “నా కొడుకుకి ఇది చేయి, అది చేయకు అని నేను ఎప్పుడూ చెప్పలేదు, ఇకముందు కూడా చెప్పను.. అది పూర్తిగా వాడి ఇష్టం. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని, వారి నిర్ణయాలను గౌరవించాలి అంటూ మాస్ మాహారాజ చెప్పుకోచ్చాడు.
మరోవైపు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అషికా రంగనాథ్, డింపుల్ హాయతి కథానాయికలుగా నటించారు.