Mass Jathara | మాస్ హీరో రవితేజ (Ravi Teja) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న (Mass Jathara Release Date) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ‘హుడియో హుడియో’ అనే కొత్త పాటను మేకర్స్ విడుదల చేశారు. చిట్టి చిలకా.. చిన్న మొలకా..అంటూ సాగే ఈ పాట లవ్ సాంగ్గా ఆకట్టుకుంటుంది. ఈ పాటకు దేవ్ లిరిక్స్ అందించగా.. అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరోలియో ఆలపించారు.