Masooda Movie Trailer | ‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వంటి కథా బలమున్న సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ బ్యానర్‌గా పేరుతెచ్చుకుంది స్వధర్మ ఎంటర్టైనమెంట్. ఈ సంస్థ నుండి వస్తున్న మూడో చిత్రం ‘మసూద’. టైటిల్ పోస్టర్ దగ్గర నుండి ఇటీవలే రిలీజైన టీజర్ వరకు సినిమాకు సంబంధించిన ప్రతీది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నవంబర్ 18న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. కాగా తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.
లేటెస్ట్గా విడుదలైన ట్రైలర్ అధ్యాంతం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్న తల్లి కూతురు.. అనుకోకుండా కూతురు ప్రవర్తనలో మార్పు.. దెయ్యం పట్టిందా లేదా తలకు ఏదైనా దెబ్బతగిలి అలా ప్రవర్తిస్తుందా.. ఆ పరిస్థితి నుండి కూతురును కాపాడటానికి తల్లి చేసిన సాహసాలేంటి. ఆమే హీరో హెల్ప్ తీసుకుని తన కూతురు ఎలా కాపాడుకుంది అనే అంశాలతో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ‘టక్ జగదీష్’ సినిమాలో ఐశ్వర్య రాజేష్ భర్తగా నెగెటీవ్ రోల్ పోషించిన తిరువర్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సంగీత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో గంగోత్రి ఫేం కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా నటిస్తుంది.