Masooda Movie On OTT | ఈ మధ్య కాలంలో హీరో, దర్శకులతో సంబంధంలేకుండా కేవలం కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక లేటెస్ట్గా అలా వచ్చిన సినిమాల్లో మసూద ఒకటి. చిన్న సినిమాగా రిలీజై బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వంటి కథా బలమున్న సినిమాలు తెరకెక్కించిన స్వధర్మ్ ఎంటర్టైనమెంట్స్ ఈ మూవీని నిర్మించడంతో రిలీజ్‌కు ముందు మంచి బజ్ ఏర్పడింది. ఇక దిల్‌రాజు రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టు గానే మొదటి రోజు నుండి ఈ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ అంతగా రాకపోయినా, రోజు రోజుకు ఈ సినిమాకు ఆధరణ పెరిగింది.
సాయి కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాలో తిరువీర్, సంగీత, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ హర్రర్ చిత్రాల్లో ఇది ఒకటి. థియేటర్లో మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21నుండి ఆహాల స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. కోటీన్నర బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం 9కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.