Masooda arrives on Amazon Prime Video | టాలీవుడ్ యువ నటులు సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ చిత్రం మసూద. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు. నవంబర్ 18 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌ను అందుకుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తెలుగులో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉండడంతో వేరే భాష ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. అయితే ఈ మూవీ వచ్చిన దాదాపు 3 ఏండ్ల తర్వాత మరో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియలో ఈ చిత్రం ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నీలం (సంగీత) ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ, భర్త అబ్దుల్ (సత్య ప్రకాశ్) నుంచి విడిపోయి, తన కూతురు నాజియా (బాంధవి శ్రీధర్)తో కలిసి ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో నివసించే గోపీ (తిరువీర్) సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతను తన సహోద్యోగి మినీ (కావ్యా కళ్యాణ్ రామ్)ను ప్రేమిస్తాడు, కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్మెంట్లో ఉండడం వల్ల గోపీ, నీలం కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతాడు. అప్పుడప్పుడు నీలం, నాజియాతో కలిసి గోపీ బయటకు వెళ్తుంటాడు. ఒక రోజు నాజియా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. అర్ధరాత్రి వేళ ఏవో వింత మాటలు మాట్లాడుతుంది. కూతురి పరిస్థితిని చూసి భయపడిన నీలం, గోపీ సహాయం కోరుతుంది. నాజియా ప్రవర్తనను గమనించిన గోపీ, ఆమెకు దెయ్యం పట్టి ఉంటుందని అనుమానిస్తాడు. ఆమెను రక్షించడానికి వారు అనేక ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్ (సత్యం రాజేశ్) సలహాతో పీర్ బాబా (శుభలేఖ సుధాకర్)ను సంప్రదిస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సవాళ్లు ఏమిటి? నాజియా శరీరంలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? మసూద ఎవరు, ఆమె నేపథ్యం ఏమిటి? మసూదను మీర్ చాచా ఎందుకు చంపాడు? నాజియాను కాపాడేందుకు గోపీ చేసిన సాహసం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, థియేటర్లో ‘మసూద’ సినిమా చూడాల్సిందే.
OTT: Horror film #Masooda arrives on Amazon Prime Video –
Originally available on Aha, Masooda is now streaming on Amazon Prime Video –
Whether you’re a horror buff or just someone looking for a quality Telugu thriller, Masooda deserves a spot on your watchlist. pic.twitter.com/j9Iuc2RCJH
— MOHIT_R.C (@Mohit_RC_91) April 23, 2025