ఇండియన్ క్లాసిక్ ‘నాయకన్’ వచ్చిన 38ఏండ్ల తర్వాత మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన చిత్రం ‘థగ్‌లైఫ్’. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో శింబు, త్రిష, అభిరామి కీలక పాత్రధారులు. జూన్ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ఓ మారా.. మార్వెల్ మాన్స్టర్.. నేనే గ్యాంగ్‌స్టర్’ అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్ రాయగా, ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. ఆదిత్య ఆర్కే ఆలపించారు. సినిమాలో శింబు పోషిస్తున్న గ్యాంగ్‌స్టర్ పాత్రలోని బోల్డ్‌నెస్‌ని ఈ పాట ప్రెజెంట్ చేస్తున్నది. నాజర్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్, నిర్మాతలు: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయ్‌నిధి స్టాలెన్, నిర్మాణం: రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, విడుదల: శ్రేష్ఠ్ మూవీస్.