మారుతి మంచి రోజులు వచ్చాయి విడుదల తేదీ కన్ఫర్మ్.. రజినీకాంత్‌తో పోటీ..

manchi rojulochaie movie release date | గోపీచంద్ హీరోగా ఓ వైపు పక్కా కమర్షియల్ సినిమా చేస్తూనే.. మరోవైపు మధ్యలో 30 రోజులు గ్యాప్ తీసుకుని మంచి రోజులు వచ్చాయి సినిమా పూర్తి చేశాడు దర్శకుడు మారుతి . కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమా పూర్తి చేశాడు మారుతి. సంతోశ్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కూడా మొదలైంది. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతితో ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, సోసోగా ఉన్నా.. ఎక్కేసిందే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. రజినీకాంత్ అన్నాత్తే సినిమా కూడా అదే సమయంలో విడుదల కానుంది.

దీపావళి కానుకగా ఒకేసారి రెండు మూడు సినిమాలు రావడం పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమాతో ఇదే చేయబోతున్నాడు మారుతి. కాకపోతే ఏకంగా రజినీకాంత్‌తో పోటీకి రెడీ అయ్యాడు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోశ్ శోభన్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మారుతి మంచి రోజులు వచ్చాయి ఈ సినిమా ఇంత తొందరగా పూర్తి చేశాడా?
మెహ్రీన్ కౌర్ కంటే ముందు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే
Mehreen Kaur Pirzada: మంచి రోజులు వచ్చాయి సినిమా నటి మెహ్రీన్ పిర్జాదా యోగా ఫొటోస్
Samantha Naga Chaitanya Divorce | అంత చిన్న గొడవ విడాకుల వరకు దారి తీసిందా.. అసలు కారణం ఇదే అట..
Samantha: ట్విట్టర్లో ఎస్ పేరుని తీసేసిన సమంత..!
Sai dharam tej | హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్.. ఆనందంలో ఫ్యాన్స్..
Kajal: కేక పెట్టిస్తున్న కాజల్ అందాలు.. ఫొటోలు వైరల్
మారుతి మంచి రోజులు వచ్చాయి విడుదల తేదీ కన్ఫర్మ్.. రజినీకాంత్‌తో పోటీ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

