ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని తెలియజెప్పాం
సంపూర్ణేష్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్'. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. తమిళ చిత్రం ‘మండేలా’కు రీమేక్ ఇది. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
సంపూర్ణేష్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. తమిళ చిత్రం ‘మండేలా’కు రీమేక్ ఇది. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ ‘తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఈ కథలో చాలా మార్పులు చేశాం. ఈ సినిమా కోసం వర్క్‌షాప్‌లో పాల్గొన్ని ప్రతీ సన్నివేశాన్ని రిహార్సల్ చేశాను. ఓ చెప్పులు కుట్టుకునే సాధారణ వ్యక్తిగా ఎలాంటి నాటకీయత లేకుండా సహజంగా నటించే ప్రయత్నం చేశా. నటుడిగా నన్ను ఓ మెట్టెక్కిస్తుందని భావిస్తున్నా. ప్రయోగాత్మక కథలో నన్ను చాలా కొత్తగా చూపించారు.
ఈ సినిమా చేశాక సమాజం పట్ల నాకు మరింత బాధ్యత పెరిగినట్లనిపించింది’ అన్నారు. వెంకటేష్ మహా మాట్లాడుతూ ‘సంపూర్ణేష్‌బాబు తెరపై కనిపిస్తే ఓ సగటు మనిషిని చూసిన భావన కలుగుతుంది. అందుకే ఆయన్ని ఈ సినిమాకు ఎంపిక చేశాం. ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పిన కథ ఇది. అన్ని భాషల వారికి కనెక్ట్ అవుతుంది. కొత్త డైరెక్టర్ అయితే సినిమాకు న్యాయం చేయగలరని పూజ కొల్లూరుకు అవకాశమిచ్చాం. తను నా అసోసియేట్. కథలోని ఆత్మను అర్థం చేసుకొని అద్భుతంగా తెరకెక్కించింది. ఎన్నికల క్షేత్రంలో ఓటర్లే కింగ్ అని ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలానే ఫీలవుతారు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

