స్వదేశీ బర్డ్ ఫ్లూ టీకా వచ్చేసింది!
కోళ్లను బర్డ్ ఫ్లూ నుంచి రక్షించేందుకు దేశంలో తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్5ఎన్1 వ్యాక్సిన్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం భోపాల్‌లో ఆవిష్కరించారు.
- కోళ్లకు ఒక్కో డోసు ధర రూ.1 నుంచి రూ.2
- ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
భోపాల్, నవంబర్ 20: కోళ్లను బర్డ్ ఫ్లూ నుంచి రక్షించేందుకు దేశంలో తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్5ఎన్1 వ్యాక్సిన్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం భోపాల్‌లో ఆవిష్కరించారు. భోపాల్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)-జాతీయ హై సెక్యూరిటీ జంతు వ్యాధుల సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. అత్యంత వ్యాధికారక పక్షి ఇన్‌ఫ్లూయెంజా (హెచ్పీఏఐ)లోని క్లేడ్ 2.3.2.1ఏకు చెందిన హెచ్5ఎన్1 వైరస్‌పై భారత్‌లో రూపొందించిన తొలి వ్యాక్సిన్ ఇదేనని వారు పేర్కొన్నారు.
సాధారణంగా బర్డ్ ఫ్లూ అని పిలిచే హెచ్పీఏఐ కోళ్లు, ఇతర పక్షులకు సోకే తీవ్ర వ్యాధి. వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు సోకిన పక్షుల్లో దాదాపు 100 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. భోపాల్‌లోని ఆనంద్‌నగర్‌లో ఉన్న ఐసీఏఆర్-జాతీయ హై సెక్యూరిటీ జంతు వ్యాధుల సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడారు. బర్డ్ ఫ్లూ నివారణ, జంతు ఆరోగ్య పరిరక్షణ రంగంలో ఈ స్వదేశీ వ్యాక్సిన్ దేశానికి ముఖ్యమైన విజయమని అన్నారు.
2006 నుంచి దేశంలో హెచ్5ఎన్1, హెచ్5ఎన్8 వైరస్‌లకు సంబంధించి 500కుపైగా వ్యాప్తి ఘటనలు నమోదయ్యాయని, ఇప్పటివరకు హెచ్5ఎన్1 వైరస్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ అందుబాటులో లేదని తెలిపారు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు భోపాల్ సంస్థ స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందని, ఒక్కో డోసు ధర రూ.1 నుంచి రూ.2 మధ్య ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా భోపాల్‌లో రూ.300 కోట్లతో అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నట్లు చౌహాన్ ప్రకటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

