Mark Shankar | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. తన కుమారుడి ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లి అక్కడి వైద్యులతోనే మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ వచ్చారు. త్వరగానే కోలుకున్న మార్క్ శంకర్ ఆసుపత్రి నుండి కూడా డిశ్చార్జ్ అయ్యాడు. అయితే మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు కావడంతో పాటు నల్ల పొగ పీల్చడం వలన వైద్యులు తగు ట్రీట్మెంట్ అందించారు.
బ్రోన్కో స్కోపీ అనే ట్రీట్మెంట్ని మార్క్ శంకర్‌కి అందించినట్టు తెలుస్తుండగా, దీనికి లక్షల ఖర్చు అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. కాని నాలుగు వేల రూపాయిల నుండి 30 వేల రూపాయిల ఖర్చుతో ఈ ట్రీట్మెంట్ అందిస్తారట. పరిస్థితి తీవ్రత ని బట్టి ఏ తరహా బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డాక్టర్స్ నిర్ణయిస్తారు. దీనిని చేయడానికి కారణం లంగ్స్ లో చేరిన విషవాయువుని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని వదలడం. దీనిని ప్రమాదం జరిగిన 30 నిమిషాల లోపే చేయాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే మార్క్ శంకర్ ఆసుపత్రి బిల్లు లక్షలలో అయి ఉంటుందని నెట్టింట చర్చ నడుస్తుంది. కాని తక్కువలోనే ట్రీట్మెంట్ పూర్తైందట.
ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా సింగపూర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు కాబట్టి, అతన్ని హైదరాబాద్ కి తీసుకురావడానికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. చిరంజీవి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఇండియా కి వచ్చే అవకాశం ఉంది . పవన్ కళ్యాణ్ మాత్రం సోమవారం వరకు వచ్చే అవకాశాలు లేవట. ప్రస్తుతం మార్క్ శంకర్ లేచి నడవగలుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఊపిరి తిత్తుల్లోకి నల్ల పొగ బాగా వెళ్లడం వలన కాస్త అసౌకర్యంగా ఫీలవుతున్నాడు. మరో రెండు మూడు రోజుల పాటు ఆక్సిజన్ మాస్క్‌తోనే మార్క్ శంకర్ ఉండనున్నట్టు సమాచారం.