Unni Mukundan | ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం (Malikapuram) వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం మార్కో (Marco).
మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. యాక్షన్ జానర్లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. 5 రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఇదే సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాను తెలుగులో జనవరి 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం.