Unni Mukundan | మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మార్కో (Marco). హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. యాక్షన్ జానర్లో ఈ సినిమా వచ్చింది.
డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. మంచి వసుళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీలివ్’ (SonyLiv)లో వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ (Marco Ott Release Date) కాబోతున్నట్లు ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది.
Biggest action thriller of Malayalam cinema is coming your way! Get ready for the ultimate adrenaline rush with #Marco, streaming Feb 14 on SonyLIV.@Iamunnimukundan #ShareefMuhammed #CubesEntertainments #HaneefAdeni #RaviBasrur #KabirDuhanSingh #AbhimanyuShammyThilakan pic.twitter.com/rTYVnYwJx2
— Sony LIV (@SonyLIV) January 31, 2025