Manushi Chhillar | ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అవార్డుల వేడుక దుబాయిలో జరిగింది. కార్యక్రమానికి బాలీవుడ్ తారలు తరలివచ్చారు. అవార్డుల ఫంక్షన్‌కు మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ సైతం హాజరైంది. ఎల్లో కలర్ డీప్ నెక్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో మెరిసింది. బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. వేడుకల్లో డ్రెస్‌లో హాజరైన వీడియోను ‘వైరల్ భయాని’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
అయితే, ఈ డ్రెస్‌లో మాజీ ప్రపంచ సుందరి కాస్త అసౌకర్యంగానే కనిపించింది. కొందరు డ్రెస్‌ని కర్టెన్ అని, మరికొందరు బెడ్‌షీట్‌తో పోల్చారు. మరికొందరు యూజర్స్ ఏకంగా మానుషిని.. ఉర్ఫీ జావెద్‌తో పోల్చారు కూడా. ఓ యూజర్ ‘అందరూ ఉర్ఫీతో పోటీపడుతున్నారు’ కామెంట్ చేయగా.. మరో యూజర్ ‘స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహిస్తోందని, ఎలా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది’ అంటూ కామెంట్ చేశాడు. మీ డ్రెస్‌లో పర్దా చిక్కుకుపోయింది.. తీయడం మరిచిపోయారు’ అంటూ మరో యూజర్ సెటైర్ వేశాడు.