సరికొత్త ప్రేమ కథ
శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మను చరిత్ర’. ఈ చిత్రాన్ని ప్రొద్దుటూర్ టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకుడు. ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతున్నది.
శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మను చరిత్ర’. ఈ చిత్రాన్ని ప్రొద్దుటూర్ టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకుడు. ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు హీరో విశ్వక్ సేన్. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ…‘నటుడిగా నన్ను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న వ్యక్తి రాజ్ కందుకూరి. ఆయన తన కొడుకు శివలాగే నన్నూ చూసుకుంటారు. ట్రైలర్ బాగుంది. లవ్, యాక్షన్ తరహా చిత్రాలను ఇష్టపడుతుంటాను.
ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలుగుతున్నది’ అన్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ…‘డ్యాన్స్, ఫైట్స్ చేయాలని ప్రతి నటుడికీ ఉంటుంది. ఈ సినిమా నాకు అలాంటి అవకాశం కల్పించింది. ఎవరినీ నిరాశపర్చని మంచి సినిమా అవుతుంది’ అన్నారు. దర్శకుడు భరత్ పెదగాని మాట్లాడుతూ…‘ఈ సినిమా సరికొత్త ప్రేమ కథగా ఆకట్టుకుంటుంది. శివ, మేఘా నటన మెప్పిస్తుంది. ఈ టీమ్‌తో మరోసారి పనిచేయాలనుంది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, నాయిక మేఘా ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

