శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. బాల సతీష్ దర్శకుడు. రాజేష్ నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని ‘బంగారి.. బంగారి..’ గీతాన్ని హీరో అడివి శేష్ లాంచ్ చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపరచగా, హరిణి ఇవటూరి ఆలపించారు.
నాయకానాయికల ప్రేమబంధాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. మురళీధర్ గౌడ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, సాయి ప్రసన్న తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: అమ్మ ముత్తు, నిర్మాణం: కనకమేడల ప్రొడక్షన్స్.