న్యూఢిల్లీ : దేశీ పెండ్లిండ్లు అనగానే ఆ హంగామా, ఆటాపాటా నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. తాజాగా పెండ్లి వేడుకలో ఓ వ్యక్తి అమితాబ్ బచ్చన్ ఆల్‌టైం హిట్ ఖైకే పాన్ బనారస్ వాలా సాంగ్‌కు హుషారైన స్టెప్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ పెద్దాయన డాన్ మూవీ నుంచి సూపర్ ఎనర్జిటిక్ సాంగ్‌కు అంతే ఎనర్జీతో కిల్లర్ మూమెంట్స్‌తో డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది.
ఎవర్గ్రీన్ సాంగ్‌కు ఆ వ్యక్తి స్టేజ్ అంతా కలియతిరుగుతూ ఈజ్‌తో చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అక్కడున్న వారిలో జోష్ నింపింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి 1.97 లక్షల మంది వీక్షించారు. ఈ వయసులోనూ ఆ వ్యక్తి ఎనర్జీ, ఫిట్నెస్ను నెటిజన్లు ప్రశంసించారు. అంకుల్ ఎనర్జీ అద్భుతమని పలువురు యూజర్లు ఫైర్ ఎమోజీలతో హోరెత్తించారు. ఖైకే పాన్ బనారస్ వాలా సాంగ్‌ను కిషోర్ కుమార్ ఆలపించగా, కళ్యాణ్‌జీ-ఆనంద్జీ కంపోజ్ చేశారు. డాన్ మూవీకి చంద్ర బరోత్ దర్శకత్వం వహించారు.