పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ (Salaar) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సలార్ పై సినీ లవర్స్ లో భారీగానే అంచనాలున్నాయి. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం జాన్ అబ్రహాం, విజయ్ సేతుపతి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) ను సలార్ లో విలన్ గా తీసుకుంటున్నట్టు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది.
కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఆర్ట్ డిపార్టుమెంట్ భారీ సెట్టు వేశారు. త్వరలోనే విలన్ పై వచ్చే సీన్లను షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారట. కేజీఎఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్ వర్క్స్, నిర్మాణ విలువలు సలార్ లో రెట్టింపు స్థాయిలో ఉంటాయని టాక్. ఇప్పటికే పలు తెలుగు చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు మనోజ్ బాజ్‌పాయ్. ఈ ఏడాది ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్.
భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్. శాండల్ వుడ్ యాక్టర్ మధు గురు స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో గోదావరి ఖని లొకేషన్ లో సలార్ షూటింగ్ మొదలైంది. శృతిహాసన్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. 1970 ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!