Manoj BajPayee | ‘ఫ్యామిలీ మ్యాన్’ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ తరువాత బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘కిల్లర్ సూప్’(Killar Soup). నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతున్న ఈ సిరీస్‌కు ‘ఉడ్తా పంజాబ్’, ‘సోంచిరియా’ సినిమాల ఫేమ్ అభిషేక్ చౌబే (Abhishek Chaubey) దర్శకత్వం వహిస్తున్నాడు. కొంకణ్ సెన్శర్మ కథనాయికగా నటిస్తుంది. సీనియర్ నటుడు నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సిరీస్ నుంచి నెట్‌ఫ్లిక్స్ ట్రైలర్ విడుదల చేసింది. రెండు నిమిషాల 22 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ అసలు కథ గురించి ఏమాత్రం హింట్ ఇవ్వకుండా ఆసక్తికరమైన విజువల్స్‌తో సాగింది. ముఖ్యంగా ట్రైలర్ మధ్యలో వచ్చే బాంబే సినిమాలోని తూ హీ రే(Tu Hi Re) సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డార్క్ కామెడీ క్రైమ్ జానర్లో ఈ సిరీస్ రానుండగా.. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయి, కొంకణా సెన్శర్మతో నాటు నాజర్, సాయాజీ షిండే, అనులా నవ్లేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.