మనోజ్, చాందిని జంటగా నటించిన చిత్రం ‘14డేస్ లవ్’. నాగరాజు బోడెం దర్శకుడు. సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిబాబు దాసరి నిర్మించారు. జనవరి 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
దర్శకుడు మాట్లాడుతూ ‘కుటుంబ విలువలను కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అతని ప్రేమకు ఎలాంటి ముగింపు లభించింది? అన్నదే ఈ సినిమా కథాంశం. కుటుంబ గొప్పతనాన్ని తెలియజెప్పే కథ ఇది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నన్ మునుస్వామి, సంగీతం: కిరణ్ వెన్న, దర్శకత్వం: నాగరాజు బోడెం.