Mano about Crazy Uncles | అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేస్తారనేదే స్టోరీ: మనో
తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లెజెండరీ సింగర్స్ లో ఒకరు మనో (Mano) . ఈ సీనియర్ యాక్టర్ కమ్ సింగర్ చాలా కాలం తర్వాత కామెడీ ఎంటర్ టైనర్ క్రేజీ అంకుల్స్ (Crazy Uncles) తో అందరినీ పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు.

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న వన్ ఆఫ్ ది లెజెండరీ సింగర్స్ లో ఒకరు మనో (Mano) . చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మనో టాప్ సింగర్స్ లో ఒకరిగా నిలిచారు. ఈ సీనియర్ యాక్టర్ కమ్ సింగర్ చాలా కాలం తర్వాత కామెడీ ఎంటర్ టైనర్ క్రేజీ అంకుల్స్ (Crazy Uncles) తో అందరినీ పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీముఖి (Sreekukhi ) మెయిన్ లీడ్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో రాజా రవీంద్ర, భరణి, మనో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు మనో.
’50 ఏళ్ల వయస్సున్న ముగ్గురు అంకుల్స్ కథ ఇది. ఈ ముగ్గురూ ఓ అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు ఎలా ప్రయత్నిస్తారు..ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యల నుంచి వారు ఎలా బయటపడతారనేదే సినిమా. మంచి సందేశంతో సాగే ఈ చిత్రం మధ్య వయస్కులకు బాగా కనెక్ట్ అవుతుంది. మిడిల్ ఏజ్ గ్రూప్ వ్యక్తులు ఎంత అప్రమత్తంగా ఉండాలో సున్నితంగా హెచ్చరించేలా క్రేజీ అంకుల్స్ ఉండబోతుందని చెప్పాడు. శ్రీవాస్ ఈ సినిమాలోని ఓ పాత్రకు తనపేరును డైరెక్టర్ సత్తిబాబుకు సూచించగా..వెంటనే సత్తిబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెప్పాడు మనో. రాజా రవీంద్ర, భరణి తనకు మంచి స్నేహితులని, ఇక శ్రీముఖి తనకు కూతురులాంటిదని చెప్పుకొచ్చాడు’ మనో.

సూపర్ స్టార్ రజినీకాంత్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పే ప్రతీసారి చాలా ఎక్జయిటింగ్ గా ఫీలవుతుంటానని మనో అన్నాడు. రజినీకాంత్ కు మొదట సాయికుమార్ తెలుగులో డబ్బింగ్ చెప్పేవాడు. ఆ తర్వాత ముత్తు సినిమాతో తొలిసారి రజినీకాంత్ కు మనో వాయిస్ అందించారు. అంతేకాదు కమల్ హాసన్ కు సతీలీలావతి, బ్రహ్మచారి చిత్రాల్లో డబ్బింగ్ చెప్పాడు. 4 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మనో 25వేలకు పైగా పాటలు పాడారు. జబర్ధస్థ్ కామెడీ షోకు వన్ ఆఫ్ ది జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు మనో. అయితే ఈ షోకు జడ్జిగా వచ్చే వరకు..నాగబాబు షో నుంచి వెళ్లిపోయిన విషయం తెలియదన్నారు మనో.
ఇవికూడా చదవండి..
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

