Manju Warrier | ఈవెంట్లో మంజు వారియర్‌కు ఊహించని అనుభవం.. అభిమాని లిప్ లాక్ వీడియో వైరల్
Manju Warrier | మలయాళ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన మంజు వారియర్‌కి కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా పాలక్కాడ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆమెకు ఎదురైన అనూహ్య ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
Manju Warrier | మలయాళ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన మంజు వారియర్‌కి కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా పాలక్కాడ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆమెకు ఎదురైన అనూహ్య ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కేరళలోని పాలక్కాడ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంజు వారియర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం అభిమానులతో ఎంతో ఓపికగా సెల్ఫీలు దిగుతూ, వారిని పలకరిస్తూ కనిపించారు. ఇదే సమయంలో ఒక మహిళా అభిమాని అకస్మాత్తుగా ముందుకు వచ్చి, అందరి ఎదుటే మంజు వారియర్‌కు బలవంతంగా ముద్దు పెట్టుకోవడం అక్కడ ఉన్నవారిని షాక్‌కు గురిచేసింది.
ఈ ఊహించని పరిణామంతో మంజు వారియర్ క్షణం పాటు షాక్‌లో ఉండిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది స్పందించి, ఆ మహిళను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటన వేదికపై కాసేపు గందరగోళ పరిస్థితిని సృష్టించింది. ఈ సంఘటనపై అక్కడ ఉన్న యాంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజ్‌పైనే ఆ మహిళా అభిమానిని మందలిస్తూ, సెలబ్రిటీల వ్యక్తిగత హద్దులను గౌరవించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అయితే, ఆ మహిళ మాత్రం తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. “నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం. ఆ ప్రేమతోనే ముద్దు పెట్టుకున్నాను” అంటూ తన వైఖరిని సమర్థించుకోవడం మరింత చర్చకు దారితీసింది.
ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా మంది తీవ్రంగా స్పందించడం సహజమే. కానీ మంజు వారియర్ మాత్రం తన హుందాతనాన్ని చాటుకున్నారు. ఘటనతో కాస్త షాక్‌కు గురైనా, ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా చిరునవ్వుతోనే పరిస్థితిని సర్దుబాటు చేశారు. అనంతరం మిగిలిన అభిమానులతో కూడా అదే ఉత్సాహంతో సెల్ఫీలు దిగుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానిని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం జెండర్ ఏదైనా సరే, అనుమతి లేకుండా ఇలా తాకడం లేదా ముద్దు పెట్టుకోవడం పూర్తిగా తప్పేనని మండిపడుతున్నారు.
A woman fan kissed actress Manju Warrier on the lips 😮
🙏🏃#Manjuwarrier #Actress #Mollywood pic.twitter.com/k8Eyz3CAAj— ananthu___ (@AnanthuBackup) April 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

