Girija Shettar | ప్రతీ ఏడాది కొత్త సినిమాలు వస్తుంటాయి..పోతుంటాయి.. కానీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయే సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఆల్‌టైమ్ క్లాసికల్ హిట్ గా నిలిచిన సినిమాల జాబితాలో టాప్‌లో ఉంటుంది మణిరత్నం ఎపిక్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ గీతాంజలి (Geethanjali). మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఈ చిత్రంతో ఇంగ్లాండ్ భామ గిరిజా శెట్టర్ (Girija Shettar) తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఎంట్రీతోనే గీతాంజలి సినిమాకుగాను ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకుంది.
గిరిజా శెట్టర్ చివరగా 2022లో వచ్చిన హృదయాంజలి సినిమాతో టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది. 2003లో చివరిసారిగా హిందీ సినిమా Tujhe Meri Kasamలో కీలక పాత్రలో నటించిన గిరిజా శెట్టర్ మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు. తాజాగా గిరిజా శెట్టర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది గిరిజా శెట్టర్. చంద్రజిత్ బెల్లియప్ప దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నడ సినిమా Ibbani Tabbida Ileyali తో కమ్ బ్యాక్ ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రంలో గిరిజా శెట్టర్ సింగిల్ మదర్ మధుమితగా కనిపించనుంది. విహాన్, అంకిత అమర్, మయూరి నటరాజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పరంవాహ్ స్టూడియోస్ బ్యానర్‌పై జీఎస్ గుప్తా, రక్షిత్ శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. గగన్ బదెరియా సంగీతం అందిస్తున్నారు.
Girija Shettar1