మణి సాయితేజ, రేఖ నిరోషా ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అనేది ఉపశీర్షిక. ముని సహేకర దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.
దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, ఓ మంచి సందేశంతో రూపొందుతున్న చిత్రం ఇది. తప్పకుండా జనాదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య, సాహిత్యం: చంద్రబోస్.