తెలుగు వెండితెరపై అజరామర ప్రణయగాథగా నిలిచిన ‘గీతాంజలి’ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతున్నది. నాగార్జున కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆల్‌టైమ్ క్లాసిక్ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. గిరిజ కథానాయిక. ఈ సినిమా ప్రపంచవ్యాప్త రీరిలీజ్ హక్కులు (చెన్నై మినహాయించి) శ్రీపద్మినీ సినిమాస్ నిర్మాత బూర్లె శివప్రసాద్ దగ్గర ఉన్నాయి. ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్ చేసి అతి త్వరలో రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, నేటితరం ప్రేక్షకులు సిల్వర్‌స్క్రీన్‌పై చూడాల్సిన అపురూప చిత్రమిదని నిర్మాత బూర్లె శివప్రసాద్ అన్నారు. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై సి.పద్మజ నిర్మించిన ‘గీతాంజలి’ 1989లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.