Mangalavaram Movie | టైటిల్ పోస్టర్ నుంచి మంగళవారం సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రంతో అల్ట్రా డిజాస్టర్ సాధించిన అజయ్ భూపతి ఈ సారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స ఇప్పటినుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను వెల్లడించారు.
ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో ఓ చెట్టుకు ఇద్దరు వ్యక్తులు ఉరేసుకున్నట్లు చూపించారు. పాయిల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నందిత శ్వేత, రంగం ఫేమ్ అజ్మల్ కీలకపాత్రల్లో నటిస్తున్పానే. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Sit tight & hold your breathe 🦋🥁💥#MangalavaaramTrailer to be out on October 21st 🔥
An @AJANEESHB Musical 🎶#Mangalavaaram @starlingpayal @Nanditasweta @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM @saregamasouth @PulagamOfficial pic.twitter.com/XRWvyYi079
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 17, 2023
ఆర్ఎక్స్100తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి.. మహా సముద్రం వంటి తేలిపోయిన సినిమా చేయడం ఎవ్వరూ ఊహించలేరు. పైగా శర్వానంద్, సిద్దార్థ్ వంటి అద్భుతమైన కాస్ట్‌ను పెట్టుకుని ఆ రేంజ్ అవుట్ పుట్ ఇవ్వడం అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. అయితే ఆ సినిమా ప్రభావం మంగళవారంపై ఏ మాత్రం పడలేదు. పైగా ఇప్పుడంతా థ్రిల్లర్ సినిమాలదే హావా అవడంతో మంగళవారం సినిమాపై జనాల్లో తిరుగులేని అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే మంచి హైప్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో బజ్ తీసుకొస్తుందో లేదో చూడాలి.