Mangalavaram Movie | ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కాంబినేషన్లో వస్తోన్న సినిమా మంగళవారం (Mangalavaaram). ఒక్క టీజర్‌తోనే ఈ సినిమా సినీ ప్రియులందరినీ తన వైపు తిప్పుకుంది. ఇక టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. దానికి తోడు రీసెంట్గా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రంతో అల్ట్రా డిజాస్టర్ సాధించిన అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ సారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటినుంచే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ ఫోర్త్ సింగిల్‌ను విడుదల చేశారు.
‘అప్పడప్పడ తాండ్ర.. ఆవకాయ తాండ్ర నీకో ముక్క నాకో ముక్క’ అంటూ సాగే ఈ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాటలో కీడా కోలా దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు. అయితే ఈ పాట ఐటెం సాంగ్ అని తెలుస్తుంది. ఇక ఆంధ్రాలో ‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర’ పాట చాలా ఫేమస్. దీన్ని ఇప్పుడు తన సినిమాలో ఐటమ్ సాంగ్‌గా పెడుతున్నారు అజయ్ భూపతి. ఈ పాటను గణేష్ ఆడెపు రాశారు. రాహుల్ సింప్లిగంజ్ ఆలపించారు. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు.
The spicy secrets are out in a witty beat 🤙🏻💥
Here’s the peppy lyrical #AppadappadaTandra from #Mangalavaaramhttps://t.co/Hvv4p92Dcc
Sung by @Rahulsipligunj ft. @TharunBhasckerD 😎🤪
An @DirAjayBhupathi‘s Vision 🎬
An @AJANEESHB Musical 🎶@starlingpayal @Nanditasweta… pic.twitter.com/XhvUpRk7Mf— BA Raju’s Team (@baraju_SuperHit) November 3, 2023
మంగళవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. మంగళవారం గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.