అజయ్‌భూపతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మంగళవారం’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్‌రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నది. మంగళవారం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె శైలజ అనే యువతి పాత్రలో కనిపించనుంది. దర్శకుడు అజయ్‌భూపతి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘1990లో గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ ఇది. మన నేటివిటీతో కూడిన విభిన్న యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది.
పాయల్‌రాజ్‌పుత్ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ఇప్పటివరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించని జోనర్ ఇది. సినిమాలో 30 పాత్రలుంటాయి. ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు. ఇప్పటికే 75 రోజులు షూటింగ్ చేశామని, వచ్చే నెలలో ఆఖరి షెడ్యూల్ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి.