Ginna Movie First Single | మంచు విష్ణు ప్రస్తుతం ఒక భారీ కంబ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చేస్తున్నాడు. ‘ఢీ’ తర్వాత ఇప్పటివరకు ఈయన కెరీర్లో ఆ స్థాయి హిట్టు పడలేదు. ప్రస్తుతం మంచు విష్ణు ఆశలన్ని ‘జిన్నా’ సినిమాపైనే ఉన్నాయి. ఇసాన్ సూర్య దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచారచిత్రాలు, గ్లింప్స్ వీడియో, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే చిత్రబృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. తాజాగా మరో అప్డేట్ను ప్రకటించారు.
ఈ సినిమాలో ‘గోలిసోడా’ అంటూ సాగే పెప్పీ నెంబర్ పాటను సెప్టెంబర్ 19న ఉదయం 11.12 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గాలి నాగేశ్వరరావు పాత్రలో మంచు విష్ణు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా సన్నిలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటించారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అవ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స్వర పరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
A chart-buster on it’s wayyy..🔥🔥
Get ready to grooooooovvvvvveeee #Golisoda, releasing on 19th September!@SunnyLeone @starlingpayal pic.twitter.com/y16ES1xbub— Vishnu Manchu (@iVishnuManchu) September 17, 2022