Manchu Vishnu – Manchu Manoj | తన తమ్ముడు మంచు మనోజ్ నటించిన మిరాయ్ సినిమా హిట్ కావాలని శుభాకాంక్షలు తెలిపారు అతడి అన్నయ్య మంచు విష్ణు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే విభేధాలు మెల్లిమెల్లిగా సద్దుమణుగుతున్నట్లు తెలుస్తున్నాయి. ఇటీవల కన్నప్ప మూవీ రిలీజ్ కాగా.. తన అన్నయ్య సినిమా కోసం మంచు మనోజ్ థియేటర్‌కు వెళ్లి అందరిని షాక్‌కి గురిచేయగా.. తాజాగా తన మిరాయ్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా విషెస్ తెలిపాడు మంచు విష్ణు.
‘మిరాయ్’ సినిమాకు అభినందనలు తెలియజేస్తూ మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. “మిరాయ్ చిత్రానికి ఆల్ ది బెస్ట్. ఈ టీమ్‌కు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌లో మంచు మనోజ్‌ను ప్రత్యేకంగా ట్యాగ్ చేయనప్పటికీ, తమ్ముడు నటించిన సినిమా విడుదల సందర్భంగా విషెస్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ పోస్ట్‌కి మంచు మనోజ్ స్పందిస్తూ.. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
Thank you soo much anna,
From team #Mirai alias #BlackSword https://t.co/JwG02gqPUo
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025