Manchu vishnu | టాలెంట్ ఉండి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహించేందుకు సరికొత్త ఆలోచనతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మంచు విష్ణు. కొత్త టాలెంట్‌ను వెలికితీసేందుకు హోం బ్యానర్ అవా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా భారీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌ను మంచు విష్ణు ప్రకటించాడు. అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ పేరుతో నిర్వహించనున్న ఈ కాంపిటీషన్లో పాల్గొనాలనుకునేవారు 10 నిడివితో షార్ట్ ఫిలింను రూపొందించాలి. స్టోరీ టెల్లింగ్, దర్శకత్వ ప్రతిభ ఆధారంగా విన్నర్లను ఎంపిక చేస్తారు.
ఇక ఈ పోటీలో గెలిచిన దర్శకుడికి ఏకంగా రూ.10 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసే అవకాశం కల్పించనున్నారు. ఈ విషయమై మంచు విష్ణు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిభావంతులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోని తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపాడు. ఈ పోటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇతర వివరాలకు సంబంధించి అవా ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించనున్నారు. మంచు విష్ణు ప్రకటించిన ఈ కాంటెస్ట్‌లో పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి.
Happy Makar Sankranti 2026 🌾✨
Wishing you and your loved ones positivity, peace, and powerful new beginnings.
On this auspicious day, I’m excited to announce the
🎬 AVAA International Short Film ContestThis is for storytellers with talent and courage.
A chance to step… pic.twitter.com/oCU8cNFo3D— Vishnu Manchu (@iVishnuManchu) January 15, 2026
Anti Biotics | యాంటీ బయోటిక్స్ వాడితే.. పేగుల ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి..!
Mirai | టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’… ఈ నెలలోనే స్టార్ మా లో సందడి
Bhadradri Kothagudem : ‘గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు’