Manchu Vishnu Kannappa Promotions | తన ఇంట్లోని జనరేటర్లో మంచు విష్ణు చక్కెర పోశాడని అందుకే కరెంట్ ఆగిపోయిందని మంచు మనోజ్ కొన్ని రోజుల క్రితం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాను, తన భార్య ఇంట్లో లేనప్పుడు తమ అమ్మకు పుట్టినరోజు కేక్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చిన విష్ణు బౌన్సర్లతో కలిసి జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ పోశాడని ఆరోపించాడు. ఆ సమయంలో తమ తల్లి, 9 నెలల కూతురు, బంధువులు మాత్రమే ఇం ట్లో ఉన్నారని తెలిపాడు. అర్ధరాత్రి జనరేటర్లు పనిచేయలేదని, విద్యుత్ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని, ప్రమాదం జరిగేలా కుట్ర చేశారని మనోజ్ ఆరోపించాడు. అయితే మనోజ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఒక చిట్ చాట్‌లో స్పందించాడు మంచు విష్ణు.
మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). ఈ సినిమాలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటించారు విష్ణు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఇంత మంచిగా రిప్లయ్ ఇస్తున్నావు మంచి మనసు నీది. ఎందుకు ఆరోజు మనోజ్ ఇంట్లో ఉన్న జనరేటర్లో చక్కెర పోశావు అని అడుగుతాడు. దీనికి మంచు విష్ణు సమాధానమిస్తూ.. ఫ్యూయల్ లో చక్కెర పోస్తే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్‌లో చదివాను అందుకే పోశానంటూ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ కామెంట్ విపరీతంగా వైరల్‌గా మారింది.
మరోవైపు ప్రభాస్ స్పిరిట్ సినిమా అడిషన్స్ కోసం అప్లయ్ చేశావు కదా అన్న ఎన్ని రౌండ్లు పాస్ అయ్యావు అంటూ అడుగగా.. విష్ణు బాధతో ఉన్న ఎమోజీని పెట్టాడు. అలాగే ఇంకో నెటిజన్ కన్నప్ప బడ్జెట్ ఎంత అని అడుగగా.. బిగ్ బడ్జెట్. నా గత చిత్ర బడ్జెట్‌కు 10 రెట్లు ఎక్కువ అంటూ సమాధానమిచ్చాడు.
Fuel lo sugar vesthe mileage peruguthundi ani WhatsApp lo chadivanu… #AskVishnu
— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2025