మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మోహన్‌లాల్, శరత్‌కుమార్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా విడుదల గురించి హీరో మంచు విష్ణు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగా డిసెంబర్లోనే విడుదల చేస్తామని ట్వీట్ చేశారు. భారీ సాంకేతిక హంగులతో ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందించేలా ఈ సినిమాను తెరకెక్కించామని మంచు విష్ణు తెలిపారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.