మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని, ముఖ్యంగా పాటలు చక్కటి ప్రజాదరణ పొందాయని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా కనిపించనున్నారు. ప్రభాస్ రుద్రుడి పాత్రను పోషిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని మంచు విష్ణు తెలిపారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.