Manchu Vishnu | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు షేర్ చేస్తూ మూవీపై అంచనాలు పెంచేశారు. చిత్రంలో ప్రభాస్.. రుద్రగా కీలకపాత్రలో కనిపిస్తుండగా.. ఇటీవల ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్తో పాటు ఈ చిత్రంలో భారీ క్యాస్టింగ్ ఉంది. అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి వారు నటించడంతో ఈ సినిమాపై ఫోకస్ చాలా ఉంది.
చూస్తుంటే ‘కన్నప్ప’ సినిమాతో మంచు విష్ణు హిట్ కొట్టి గట్టెక్కేట్టుగానే కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్.. కీలకపాత్రలో కనిపిస్తుండటంతో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘కన్నప్ప’ సినిమా గురించి మాట్లాడిన మంచు విష్ణు.. ‘కన్నప్ప సినిమా తరువాత నన్ను కన్నప్పగానే గుర్తిస్తారు. ఇది నా అరంగేట్రం అని అనుకోవచ్చు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ ఓ లెక్క.. కన్నప్ప మరోలెక్క. ఆ శివుడి అనుగ్రహంతో ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని అన్నాడు. లార్డ్ శివగా.. అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్గా సూట్ అవుతారని అనుకున్నా. ఆయన పాత్ర హైలైట్ అవుతుంది. ప్రభాస్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆయనో అద్భుతం. ఆయనకి ఉన్న స్వాగ్.. వెరీ వెరీ కూల్ స్వాగ్.
ప్రభాస్ కన్నప్ప చేయడానికి మెయిన్ రీజ్ నాన్నగారు. ఆయనపై ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఈ సినిమా చేశారు. ఈ పాత్రకి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాల్సిన టైంలో చెప్తాను అని విష్ణు అన్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత అయి ఉంటుంది అనే దానిపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్ లో ఉంది. నేను కన్నప్ప బడ్జెట్ చెప్తే రేపు పొద్దున్నకి IT వాళ్ళు మా ఇంటి ముందు క్యూ కడతారు. రాజాసాబ్, ఓజీ సినిమాల కంటే మా కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువ అని మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. విష్ణు చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టు అర్ధమవుతుంది.