Manchu Manoj | కుటుంబ వివాదాల నేపథ్యంలో నటుడు మంచు మోహన్, మంచు మనోజ్‌లు నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ని కలిశారు. ఆస్తుల విషయంలో నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సమయంలోనూ మరోసారి కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరోకరు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. అయితే ఈ ఫిర్యాదులకు సంబంధించి నేడు విచారణకు హాజరయ్యారు మోహన్ బాబు, మనోజ్.