Manchu Manoj | ‘బైరవం’, ‘మిరాయ్’ లాంటి సక్సెస్‌లతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన మంచు మనోజ్.. ఇప్పుడు కెరీర్లోనే అత్యంత ఇంటెన్స్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్ ఖరారైంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ లుక్ పూర్తిగా షాక్ ఇచ్చేలా ఉంది. చేతిలో ఆయుధం, కళ్లలో ప్రతీకారం, ముఖంలో క్రూరత్వం… ఓ భారీ యాక్షన్ సీన్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించిన మనోజ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ లుక్‌ను షేర్ చేస్తూ మనోజ్ – “ఇది నాలో ఇప్పటివరకూ బయటకు రాని ఒక వైపు. ఎలాంటి కరుణ లేని పాత్ర” అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. ‘డేవిడ్ రెడ్డి’ కథ బ్రిటీష్ పాలన కాలంలో జరుగుతుంది. 1897 నుంచి 1922 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించారు. హీరో పాత్ర ఫిక్షనల్ అయినప్పటికీ, సామాజిక అణచివేతలు, కుల వివక్ష, బ్రిటీష్ అణచివేతకు ఎదురొడ్డి నిలబడిన ఓ రెబల్ యోధుడి ప్రయాణమే ఈ సినిమా మూలకథ. స్వాతంత్య్రం అడిగి కాదు.. పోరాడి తెచ్చుకోవాలి అనే సిద్ధాంతంతో ముందుకెళ్లే పాత్రగా మనోజ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో మనోజ్ వాడే భారీ బైక్ ‘వార్ డాగ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 700 కేజీల బరువు ఉన్న ఈ బైక్‌తో పాటు, ఆయన చేతిలో ఉండే స్టిక్‌ను ‘డెత్ నోట్’గా వర్ణిస్తున్నారు. ఇవే డేవిడ్ రెడ్డి ప్రధాన ఆయుధాలు అని దర్శకుడు వెల్లడించారు.
వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్, నల్లగంగుళ వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్గా మరియా నటిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. చరిత్ర పుస్తకాల్లో కనిపించని కొన్ని దారుణ సంఘటనలు, వాటిని ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి ఎంత తీవ్రంగా పోరాడితే ఎలా ఉంటుందనే అంశాన్ని ‘డేవిడ్ రెడ్డి’ చూపించనుందని మనోజ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఫస్ట్ లుక్‌తోనే ఆ మాటలకు బలం చేకూరింది. మొత్తానికి… మంచు మనోజ్ కెరీర్లోనే మోస్ట్ వైలెంట్, మోస్ట్ ఇంటెన్స్ పాత్రగా ‘డేవిడ్ రెడ్డి’ నిలవబోతోందన్నది ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.