Manchu Manoj | ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు.. అతడి కుమారుడు మంచు మనోజ్‌ల మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. కుటుంబ వివాదం నేపథ్యంలో ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిని మంచు మనోజ్ నాన్న అంటే తనకు ప్రాణం అని. మా నాన్న నాకు ఎప్పటికి దేవుడే అంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేగాకుండా.. మా నాన్నను అన్న విష్ణు.. వినయ్ అనే వ్యక్తి కలిసి ట్రాప్ చేసి.. నా నుంచి అతడిని దూరం చేస్తున్నారని తెలిపాడు. అయితే మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన దాడిలో అస్వస్థతకు గురవ్వడంతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరాడు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఇదిలావుంటే మంచు మనోజ్‌కి తన నాన్నంటే ఎంత ప్రేమనో చెప్పడానికి అతడు క్రియేట్ చేసిన ఒక పాత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మోహన్ బాబు పుట్టినరోజు సందర్బంగా యానిమల్ సినిమాలోని నాన్న నువ్వు నా ప్రాణం అనే సాంగ్ మీద వీడియోను పెట్టాడు మనోజ్. లైఫ్‌లో నువ్వు నేర్పినా పాఠాలకు.. నా జీవితానికి ధన్యవాదాలు.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా అంటూ రాసుకోచ్చాడు. అయితే ఈ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా ఈ వీడియోను మీరు చూసేయండి.
Happy Birthday Nanna,
Thank you for the Lessons, Laugh & Life.— Yours always, Manu. pic.twitter.com/R9DOdnrVed
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 20, 2024