Manchu Manoj | ఐదేళ్ల తర్వాత కెమెరా ముందుకు మంచు మనోజ్.. అమ్మలాంటి సినిమా అంటూ ఎమోషనల్..!
What The Fish Movie | అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం ‘ఒక్కడు మిగిలాడు’ అనే సినిమాలో హీరోగా కనిపించాడు మంచు మనోజ్. ఆ తర్వాత రెండు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసాడు. మళ్లీ ఇప్పటివరకు తెరపై కనిపించలేదు.
What The Fish Movie | అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం ‘ఒక్కడు మిగిలాడు’ అనే సినిమాలో హీరోగా కనిపించాడు మంచు మనోజ్. ఆ తర్వాత రెండు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసాడు. మళ్లీ ఇప్పటివరకు తెరపై కనిపించలేదు. మధ్యలో ‘అహం బ్రహ్మస్మి’ అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా వదిలాడు. కానీ ఆదిలోనే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ఐదేళ్ళుగా మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దాంతో మనోజ్ సినిమాలు మానేశాడు అనే అనుకున్న టైమ్‌లో ‘వాట్ ది ఫిష్’ అంటూ నాలుగు నెలల క్రితం కొత్త సినిమాను ప్రకటించాడు. టైటిల్‌తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ వెంటనే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్‌లు ఊహించని రేంజ్లో జనాలను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్నో ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన మనోజ్.. కెమెరాకు దండం పెడుతున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అమ్మ లాంటి సినిమా దగ్గరకు మళ్లీ వచ్చాను. లవ్ యూ ఆల్ అంటూ ట్వీట్ చేశాడు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వరుణ్ కోరుకుండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో మనోజ్ గుడ్ అండ్ బ్యాడ్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్‌ను ఫినీష్ చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక దీనితో పాటు మంచు మనోజ్ ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Back to my Amma, CineMA 🙏🏼❤️ Love you all with all my heart ❤️ pic.twitter.com/woQRMveQmK
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 21, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

