Manchu Manoj Comments | కుటుంబ వివాదాల నేపథ్యంలో నటుడు మంచు మనోజ్(Manchu Manoj) నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ (Rangareddy Collector)ని కలిసిన విషయం తెలిసిందే. జల్పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని.. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ.. కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు(Mohan Babu) జిల్లా మేజిస్ట్రేట్‌ని ఆశ్రయించారు. అయితే మోహన్ బాబు ఫిర్యాదు మేరకు జల్పల్లిలో నివాసం ఉంటున్న మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు.
దీంతో ఈ ఫిర్యాదుకు సంబంధించి కలెక్టర్ ముందు విచారణకు నేడు హాజరు అయ్యాడు మనోజ్. అయితే విచారణ అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఆస్తి గొడవలు లేవని తెలిపాడు. నేను కుర్చోని మాట్లాడుదాం అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. కానీ ఎవరు స్పందించట్లేదు. ఎవరికి భయపడి నేను పారిపోవట్లేదు. మీరు ఎక్కడికి పిలిచిన వస్తాను. ఇది ఆస్తి కోసం కాదు. మా విద్యాసంస్థల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. వారికోసం మాట్లాడుతున్నాను. ఈ పోరాటం నా స్టూడెంట్స్ కోసం.. నా బంధువుల కోసం.. నా ప్రజల కోసం అని తెలిపారు.