Manchu Manoj Pree Meet | గత కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మీడియా ముందుకు వచ్చాడు మనోజ్.
ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు. ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఈ సమస్య నా ఒక్కరిదే కాదు. నా స్టూడెంట్స్ కావచ్చు.. లేదా మా కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రజల కోసం కావచ్చు వారి కోసమే ఈ పోరాటం. నేను అందరి కోసం పోరాడుతుంటే నా మీదా అటాక్‌లు చేస్తూ.. తప్పుడు కేసులు పెడుతూ.. నా కుటుంబ సభ్యులను ఇందులోకి లాగుతూ.. ఒక మనిషిని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని చేస్తున్నారు. ఇవన్ని చూసి నేను భయపడతాను అనుకుంటున్నారేమో.. అది ఈ జన్మలో జరగదు అంటూ మనోజ్ చెప్పుకోచ్చాడు.
Also read..