Manchu Manoj | గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా విష్ణు,మనోజ్ మధ్య గొడవలు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వివాదంతో నలిగిపోతున్న మనోజ్ మరోవైపు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. మనోజ్ భైరవం అనే చిత్రంలో నటించగా, ఇందులో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కించగా,ఈ చిత్రం మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. సినిమా గురించి చెబుతూ ఆ టైంలో తన ఇంట్లో జరిగిన గొడవల గురించి కూడా ప్రస్థావించాడు. మధ్యలో విష్ణు మీద కూడా పరోక్షంగా కౌంటర్లు వేశాడు. తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చాను.. కొత్త సినిమాను స్టార్ట్ చేశాను.. రీ లాంచ్ అనుకున్నాను.. కరోనా వచ్చింది.. ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది.. తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.. కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.. ఇంకా సినిమాలు చేయ్ అన్నా.. కమ్ బ్యాక్ ఇవ్వు అని అంటున్నారు.. ఆ ప్రేమకు నేను సినిమాతోనే సమాధానం ఇస్తాను.. అలానే శివయ్యా అని పిలిస్తే ఆ శివుడు రాడు.. మనసులో తలుచుకుంటే.. మా డైరెక్టర్ లానో, మా నిర్మాతలానో వస్తాడు.. మా మీద నమ్మకంతో 50 కోట్ల వరకు నిర్మాత ఖర్చు పెట్టారు అని మనోజ్ అన్నారు.
అయితే అంతకముందు మనోజ్‌పై ఓ వీడియో (ఏవీ) ప్రదర్శించారు. అది చూసి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మోహన్ బాబు, విష్ణుతో ఆస్తి తగాదాలు, పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేయగా,ఆ సమయంలో మనోజ్ మనసులో అన్ని కదలాడాయి. దాంతో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఓదార్చిన కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ తెర మీదికి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమని అంటూ మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
#ManchuManoj is CRYING by Seeing His JOURNEY in #Bhairavam Event – STRONG ComeBack Loading.
— GetsCinema (@GetsCinema) May 18, 2025