Manchu Lakshmi | మోహన్ బాబు ముద్దులు కూతురు మంచు లక్ష్మీ తన తల్లి సమాధిని దర్శించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన చాలా మందికి ఒక డౌట్ రావచ్చు.. మోహన్ బాబు భార్య నిర్మలాదేవి బ్రతికే ఉన్నారు కదా? మరి లక్ష్మీ తల్లి సమాధి వద్ద నివాళులు అర్పించడం ఏంటని, చాలా మందికి డౌట్ రావచ్చు. ఇది సహజమే. కానీ చాలా మందికి తెలియని నిజం ఏంటంటే మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు విద్యాదేవి కాగా, ఆమెకే మంచు విష్ణు, మంచు లక్ష్మీలు పుట్టారు. విద్యాదేవి అనారోగ్యంతో మరణించాక, మోహన్ బాబు విద్యా దేవి చెల్లెలైన నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమెకు పుట్టినవాడే మంచు మనోజ్.
మోహన్ బాబు ముగ్గురు పిల్లలను ఒకేలా ప్రేమిస్తూ, సమానంగా పెంచారు. నిర్మలాదేవి కూడా విద్యాదేవి పిల్లల్ని తన కన్నబిడ్డలుగా చూసుకుంది. మనోజ్ పుట్టిన తర్వాత కూడా లక్ష్మీ, విష్ణువులపై ప్రేమ తగ్గకుండా, తల్లిగా మారి వారిని పెంచి పెద్ద చేసింది. అందుకే చాలామందికి వీరంతా ఒకే తల్లికి పుట్టారన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే ఇటీవల వచ్చిన విభేదాలతో వాస్తవాలు బయటపడ్డాయి. మంచు విష్ణు -మంచు మనోజ్ మధ్య తలెత్తిన విభేదాల విషయంలో లక్ష్మీ మాత్రం మనోజ్ పక్షాన నిలవడం గమనార్హం. సొంత తమ్ముడు విష్ణుని వ్యతిరేఖించి, మనోజ్‌కు అక్కగా పెళ్లి చేసి, ఆ బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది.
అయితే ఎంత ప్రేమ చూపించినా, కన్నతల్లి అంటే ప్రత్యేకతే. అందుకే అవకాశమొచ్చినప్పుడల్లా లక్ష్మీ..విద్యాదేవి సమాధిని దర్శించి, ఆమెకు నివాళులు అర్పిస్తూ ఉంటుంది. ఇటీవల నెల్లూరు పర్యటనలో భాగంగా, నాయుడుపేటలోని తల్లి సమాధిని సందర్శించిన లక్ష్మీ.. పూలమాల వేసి,నివాళులు అర్పించింది. అమ్మ లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఆమె జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నా వెన్నంటే ఉంటాయి అని భావోద్వేగంతో చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. కాగా, ఒకప్పుడు నటిగా, నిర్మాతగా సత్తా చాటిన మంచు లక్ష్మి ఇప్పుడు అంతగా అలరించలేకపోతుంది.