మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దక్ష-ది డెడ్లీ కాన్సిరసీ’. సీనియర్ హీరో మంచు మోహన్‌బాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను అగ్ర హీరో అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలందజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. తండ్రీకూతుళ్లను డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రం మంచు లక్ష్మి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. సముద్రఖని, సిద్ధిక్, విశ్వంత్, చిత్రాశుక్లా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ మల్లా.