Baramulla Trailer | కశ్మీర్ లోయలోని బారాముల్లా పట్టణంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బారాముల్లా’ (Baramulla). సూపర్నాచురల్ హారర్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మానవ్ కౌల్ (Manav Kaul) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆదిత్య సుహాస్ జంభాలే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 07న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ను చూస్తుంటే.. కశ్మీర్ లోయలో ఉన్న బారాముల్లాలో పిల్లలు వరుసగా అదృశ్యమవడం చుట్టూ ఈ సినిమా కథ జరుగబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేసేందుకు డీఎస్పీ రిద్వాన్ షఫీ సయ్యద్ (మానవ్ కౌల్) బారాముల్లాకు వస్తారు. ఇక రిద్వాన్ బారముల్లాకి వచ్చిన అనంతరం జరిగిన సంఘటనలు ఏంటి. మిస్సింగ్ అవుతున్న చిన్నారులను రిద్వాన్ ఎలా కనిపెడతాడు.? రిద్వాన్ ఇంట్లో చోటుచేసుకున్న భయంకరమైన సంఘటనలు ఏంటి.? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.