Mana Shankara Vara Prasad Garu Second single | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్’ (MSG) చిత్రం నుంచి తాజాగా రెండో పాట విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘మీసాల పిల్ల’ భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం తదుపరి పాట అప్డేట్తో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ‘శశిరేఖ’ (Sasirekha) అనే పేరుతో రాబోతున్న ఈ రెండో పాట డిసెంబర్ 08న విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ (షైన్ స్క్రీన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
The love for #MeesaalaPilla continues to grow each day ❤️
Now, make way for another chartbuster song from #ManaShankaraVaraPrasadGaru 🤗🫶
Second single #Sasirekha Lyrical Video on December 8th ❤️🔥
Song Promo on December 6th❤️
A #BheemsCeciroleo Musical💥#ChiruANIL ~ #MSG… pic.twitter.com/pxPEcOjQlA
— Shine Screens (@Shine_Screens) December 4, 2025